translate gadget

Sunday, May 06, 2012

మామిడికాయ పెసరుపప్పు కూర

కావాల్సిన పదార్థాలు :


మామిడికాయలు చిన్నవి 4
పెసరుపప్పు 100 గ్రాములు
నూనే 50 గ్రాములు
కారం ఒక చెంచా
ఉప్పు రుచికి సరిపడా
పసుపు కొద్దిగా
అల్లంవెల్లుల్లి ఒక చెంచా
తరిగిన ఉల్లిపాయ 2
జీలకర్ర అర చెంచా
మసాల ఒక చెంచా
కోతిమెర అర కప్పు
కరివేపాకు ఒక రెమ్మ
పచ్చిమిరపకాయలు  4
ఆవాలు అర చెంచా
ధనియాల పొడి ఒక చెంచా

తయారుచేసే విధానం:


 మొదటగా మామిడికాయలు  10-15 నిముషాలునీళ్ళలో నానబెట్టాలి ,ఇలా నానబెట్టడం వల్ల  తొక్క తీయడం శులభం అవుతుంది తరవాత తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. పెసరు పప్పు శుభ్రంగా  కడిగి 10 నిముషాలు నానబెట్టాలి
 ఈ సమయంలో మనం కావలసిన మిరపకాయలు , ఉల్లిపాయలు కోతిమెర తరిమి పెట్టుకోవాలి
 ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నూనే వేడిచేసుకోవాలి నేను వేడి అయ్యాక ఆవాలు ,జీలకర్ర, వేసుకొని , వెంటనే తరిగిన ఉల్లిపాయలు మరియు మిరపకాయలు వేసుకొని ఒక నిమిషం పటు ఉడికించుకోవాలి
ఇప్పుడు పసుపు , కారం , సగం ఉప్పు వేసి మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి. తరిగిన మామిడి కాయ ముక్కలు వేసి రెండు నిముషాలు ఆగి పెసరు పప్పు , ధనియాల పొడి వేసుకొని  మిగిలిన ఉప్పు వేసి మూత పెట్టి 5 నిముషాలు ఉడికించుకోవాలి
తర్వాత మసాల కోతిమెర మరియు కరివేపాకు వేసి స్టవ్ ఆపు చేసి మూత పెట్టాలి ఆవిరి పైన ఒక నిమిషం ఉడికాక దించుకొవాలి
 ఇలా మనందరం ఎంతో ఇష్టపడే మామిడికాయ పెసరుపప్పు కూర తాయారు చేసుకున్నాం ..
 దీనిని అన్నం తో గాని , రోటి, లేదా నంతో గని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది . వేడిగా ఉన్నపుడే ఆరగించండి , చిన్నపిల్లలు పుల్లటి వాసనకు ఎంతో ఇష్టపడుతారు కావున ఇష్టంగా తింటారు ..


No comments:

Post a Comment